News March 31, 2025
తిరుపతిలో కిడ్నాప్ కథ సుఖాంతం

తిరుపతి జీవకోనకు చెందిన రాజేశ్ కుటుంబాన్ని రెండు రోజుల క్రితం రూ.2 కోట్ల కోసం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ సమయంలో రాజేశ్ తప్పించుకోగా.. ఆయన తల్లి విజయలక్ష్మి కూడా కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్నారు. కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రావడంతో రాజేశ్ భార్య సుమతి, ఇద్దరు పిల్లలను కిడ్నాపర్లు బెంగళూరులో వదిలిపెట్టారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో శివాని ప్రభంజనం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో హన్మకొండ శివానీ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని కరస్పాండెంట్ టి.స్వామి పేర్కొన్నారు. MPC-IIలో సాయిజ, మాధవి 995, హాసిని 993(BIPC-II) & రిషిత, నవదీప్ 468(MPC-1), స్వాతి 435 (BIPC-1), CEC-Iలో కార్తీక్ 484 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్స్‌తో కలిసి అభినందించారు.
News April 22, 2025
పార్వతీపురం: ‘ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు’

ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని DEO జ్యోతి మంగళవారం తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు.
News April 22, 2025
విశాఖ: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విశాఖలో 29,997 మంది పరీక్ష రాయగా వారిలో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 28,523 మంది, ఓపెన్ స్కూల్ 1,404 మంది, 2,124 వృత్తి విద్యా పరీక్ష రాశారు. 134 సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it