News March 18, 2025
తిరుపతిలో దాడిపై స్పందించిన ఈసీ

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో హింస జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎట్టకేలకు స్పందించింది. ఎంపీ గురుమూర్తి చేసిన ఆరోపణలపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఈసీ ముఖ్య కార్యదర్శి కేఆర్బీ హెచ్ఎన్ చక్రవర్తి లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేశారని ఈసీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.
Similar News
News March 19, 2025
ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం: భట్టి

TG: గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
News March 19, 2025
విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసింది: లోకేశ్

AP: ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడం సరికాదని చెప్పారు. కాగా బొత్సతో చర్చకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. ఐటీ సిలబస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.
News March 19, 2025
తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్గా పాలమూరు వాసి

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.