News March 18, 2025
తిరుపతిలో దాడిపై స్పందించిన ఈసీ

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో హింస జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎట్టకేలకు స్పందించింది. ఎంపీ గురుమూర్తి చేసిన ఆరోపణలపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఈసీ ముఖ్య కార్యదర్శి కేఆర్‌బీ హెచ్ఎన్ చక్రవర్తి లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేశారని ఈసీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.
Similar News
News April 24, 2025
భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణంపేటలో 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. ముందు ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
News April 24, 2025
ఉగ్ర దాడి.. మరో విషాదగాథ

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ(33)కి రెండేళ్ల కిందటే పెళ్లైంది. UAEలో పనిచేస్తున్న అతను సిమ్లాలో ఓ పెళ్లి కోసం ఇటీవలే భార్యతో కలిసి INDకు వచ్చారు. అది పూర్తయ్యాక పహల్‌గామ్ వెళ్లి టెర్రరిస్టుల చేతిలో మరణించారు. ఇతని తండ్రి పదేళ్ల కిందటే చనిపోగా తల్లి జ్యోతి కష్టపడి చదివించారు. నీరజ్ చనిపోవడంతో తల్లి, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News April 24, 2025
MBNR: ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి

ఉమ్మడి పాలమూరు జిల్లాల వాసులకు నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SBI RSETI సంస్థ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ తెలిపారు. ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. హౌస్ వైరింగ్ కోర్సులో ఈనెల 30లోగా SSC MEMO, ఆధార్, రేషన్ కార్డు,3 ఫోటోలతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. వయస్సు 19-45 ఏళ్లలోపు ఉండాలన్నారు. -SHARE IT