News November 11, 2024

తిరుపతిలో దొంగనోట్లు ఎలా తయారు చేశారంటే..?

image

తిరుపతి జిల్లాలో <<14578425>>దొంగనోట్ల <<>>ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుకు తిరుపతికి చెందిన రమేశ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యారు. చెర్లోపల్లి సర్కిల్ వద్ద ఉన్న రమేశ్ ఇంట్లో ఉంటూ షేర్ మార్కెట్ బిజినెస్ చేయగా నష్టపోయారు. దీంతో యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తిలో ఈ దందా నడిపారు. చివరకు పోలీసులకు చిక్కారు.

Similar News

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

image

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.

News November 30, 2025

చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

image

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.