News March 16, 2025

తిరుపతిలో నేటి చికెన్ ధరలు ఇవే

image

తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ ధర స్కిన్‌తో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. అలాగే స్కిన్ లెస్ రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. లేయర్ చికెన్ ధర రూ.110 నుంచి రూ.120 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. ఆదివారం అయినప్పటికీ వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు వాపోయారు.

Similar News

News December 4, 2025

PDPL: సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక దృష్టి: CP

image

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్, ప్రవర్తనా నియమావళి అమలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సింగిల్ నామినేషన్లు లేవని VCలో పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక పర్యవేక్షణ పెడుతున్నట్లు CP అంబర్ కిషోర్ ఝా చెప్పారు.

News December 4, 2025

నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

image

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.

News December 4, 2025

ఉమ్మడి వరంగల్‌లో 130 ఏళ్ల పంచాయతీరాజ్‌ ప్రస్థానం

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ 130 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. HYD పంచాయతీ చట్టం నుంచి మొదలైన ఈ ప్రయాణంలో అశోక్‌ మెహతా కమిటీ సిఫార్సులు, మండల వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలు బలోపేతం అయ్యాయి. తండాలకు పంచాయతీ హోదా లభించడంతో జీపీల సంఖ్య 567 నుంచి 1708కి పెరిగింది. ఈ వ్యవస్థ ద్వారానే అనేకమంది నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు.