News August 24, 2024

తిరుపతిలో బాలికపై అత్యాచారం

image

తిరుపతిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్ ఎస్ఐ బాలకృష్ణ వివరాల మేరకు.. బాలిక హాస్టల్లో ఉంటూ తిరుపతిలోని ఓ మునిసిపల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆమెను రుషి అనే యువకుడు బుధవారం పాఠశాల నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 17, 2024

తిరుపతి: చాట్ బాట్ ద్వారా 310 ఫోన్లు రికవరీ

image

చాట్ బాట్ ద్వారా11వ విడతలో రూ.62 లక్షల విలువ గల 310 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…10 విడతలలో సుమారు రూ.6, 07 కోట్లు విలువచేసే 3,530 సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాట్సప్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

News September 17, 2024

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం

image

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని FactCheck.AP.Gov.in పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 29వ తేదీన విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది అని తెలిపింది. తిరుమల ప్రతిష్ట మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని ట్విటర్‌లో తెలిపింది.

News September 17, 2024

శ్రీవారి భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఈవో

image

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఈవో శ్యామలరావు సూచించారు. మంగళవారం తిరుమలలో దుకాణదారులతో ఆయన సమావేశం అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా వారికి అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.