News August 26, 2024

తిరుపతిలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్

image

తిరుపతి పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటన స్థానిక అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో జరిగింది. రన్నింగ్ బస్సు టైర్ కింద తల పెట్టేందుకు ప్రయత్నించగా డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు అతనిని వారించి పక్కకు తీసుకెళ్లారు.

Similar News

News July 10, 2025

పూతలపట్టు: గోడ కూలి మహిళ మృతి

image

పూతలపట్టు మండలం బందర్లపల్లి గ్రామంలో కూలి మృతి చెందింది. మూర్తిగాను గ్రామానికి చెందిన మల్లిక అనే మహిళ బందర్లపల్లి గ్రామంలో పని చేస్తూ ఉండగా ఆమెపై గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.

News July 9, 2025

చిత్తూరు: జగన్ పర్యటనపై DSP సూచనలు

image

బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనపైన DSP సాయినాథ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మహేశ్వర్, నెట్టికంటయ్యలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జగన్ పర్యటనలో తప్పనిసరిగా పోలీసులు విధించిన ఆంక్షలు పాటించాలన్నారు. 500 మంది రైతులు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పదు అన్నారు.150 మందికి నోటీసులు జారీచేశామన్నారు.

News July 8, 2025

చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

image

చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తే సహకారం అందజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.