News April 5, 2025

తిరుపతిలో మహిళ అనుమానాస్పద మృతి

image

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ్ కాలనీలో మహిళ అనుమానాస్పదంగా చనిపోయారు. మృతురాలు లక్ష్మీప్రసన్న(55)గా గుర్తించారు. రెండు రోజుల నుంచి ఇంట్లో నిర్జీవిగా ఉన్న మహిళను యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి రుయా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈస్ట్ ఎస్ఐ మహేశ్ తెలిపారు.

Similar News

News January 9, 2026

జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.

News January 9, 2026

HYD: రాహుల్ సిప్లిగంజ్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

image

రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ‘కల్ట్’ వెబ్ సిరీస్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి చిన్నారుల హత్య కేసు ఆధారంగా తప్పుడు కథతో వెబ్ సిరీస్ నిర్మించి ఈ నెల 17న విడుదలకు ప్రయత్నించడం సరికాదని పిటిషనర్ ఉత్తం వల్లూరి చౌదరి తెలిపారు. ఇది తమ పరువు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేసును అడ్వకేట్ రామారావు ఇమ్మానేని వాదిస్తున్నారు.

News January 9, 2026

ప్రకాశం కలెక్టర్ సంచలన కామెంట్స్.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరోమారు రెవిన్యూ అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించి అమాయకులైన ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకోనంటూ కలెక్టర్ హెచ్చరించారు. అలాగే తమ అధికారాలను సక్రమంగా వినియోగించాలని, పద్ధతి పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.