News July 13, 2024
తిరుపతిలో మహిళ దారుణ హత్య

తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని విద్యుత్ నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. చాకుతో మహిళ గొంతు కోసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆమెను హత్య చేసింది ఎవరూ, హత్యకు కుటుంబ కలహాలా, లేక వేరే ఇతర కారణమా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
చిత్తూరు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల గరిష్ఠంగా నమోదవుతాయన్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
చిత్తూరులో 19, 20న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

చిత్తూరులో 19, 20 తేదీల్లో ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు.19న మిషన్ వాత్సల్య పథకంలో ఒక కౌన్సిలర్, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, 20న మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న 3 మల్టీపర్పస్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
News February 17, 2025