News February 17, 2025

తిరుపతిలో ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటన

image

తిరుపతిలో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మంగళం సమీపంలో జరగనుంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Similar News

News March 21, 2025

ఉల్లిపాయ తింటే కలిగే ప్రయోజనాలివే..!

image

ఉల్లిపాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. తద్వార వడదెబ్బ తాకే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే అధిక నీటిశాతం, ఖనిజాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది తద్వార జీర్ణశక్తి పెరుగుతుంది. సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి. ఇవి తినటం వల్ల చర్మం, జుట్టుకు సైతం ఎంతో మేలు.

News March 21, 2025

ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.

News March 21, 2025

నల్లబెల్లి: తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమారుడు

image

తల్లిదండ్రుల కలను ఓ కుమారుడు నెరవేర్చాడు. నల్లబెల్లి మండల పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలి, పద్మ దంపతుల కుమారుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2023 టీఎస్పీఎస్పీ సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో భద్రాద్రి జోన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు.

error: Content is protected !!