News June 15, 2024
తిరుపతిలో యువకుడు దారుణ హత్య

తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లోని ఓఆయిల్ షాపు వద్ద ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన మాదం ప్రసాద్‌గా గుర్తించారు. మద్యంమత్తులో గుర్తుతెలియని వ్యక్తులు ప్రసాద్‌తో శుక్రవారం రాత్రి 2 గంటల వరకు గొడవపడి, వెంటబడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరచారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Similar News
News October 14, 2025
చిత్తూరు: యువతకు క్రీడా పోటీలు

వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ బాగా ఆడితే జాతీయస్థాయిలో నిర్వహించే యువజన పోటీలకు పంపిస్తామని చెప్పారు. జిల్లాస్థాయి పోటీలు ఈనెల 15న చిత్తూరు సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతాయన్నారు.
News October 13, 2025
చిత్తూరు పోలీసులకు 34 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల నుంచి 34 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వీటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇందులో అత్యధికంగా భూతగాదాలపై 13 ఫిర్యాదులు అందాయి.
News October 13, 2025
చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.