News March 20, 2025
తిరుపతిలో యువకుడు దారుణ హత్య

తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని రెండు మూడు రోజుల క్రితం హత్య చేశారు. మృతుడు మొఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతుడు వద్ద ఇటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు, క్లూస్ టీం బృందం పరిశీలించింది.
Similar News
News November 6, 2025
అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్

ఇవాళ ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల నేపథ్యంలో అఫ్గాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్లను ఎదుర్కోవడానికి సైనిక ఘర్షణే ఏకైక పరిష్కారమా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘చర్చలు విఫలమైతే యుద్ధం జరుగుతుంది’ అని ఆసిఫ్ పేర్కొన్నారు. గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందానికి కొనసాగింపుగా ఇవాళ తుర్కియే, ఖతర్ చొరవతో మరోసారి చర్చలు జరగనున్నాయి.
News November 6, 2025
కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్?

కొత్త జిల్లాలు, డివిజన్ల మార్పుచేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. బనగానపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే అంశంపై ఉపసంఘం చర్చించింది. మంత్రి BC జనార్దన్‌రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ అంశాన్ని పరిశీలించింది. మరోవైపు కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటుపైనా ఉపసంఘం దృష్టి సారించింది. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.
News November 6, 2025
10వ తేదీ జోగులాంబ ఆలయంలో కార్తీక సంబరాలు

ఈనెల 10వ తేదీ అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పరంపర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరపత్రికను విడుదల చేసింది. ఆలయాల వైభవం ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు ఉట్టిపడేటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంబరాలు చోటుచేసుకొనున్నాయి.


