News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
Similar News
News February 25, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.
News February 25, 2026
GNT: పత్తి రైతులకు ఊరట..!

2025-26 పత్తి సీజన్‌లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులకు మంచి లాభం చేకూరింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ఆధ్వర్యంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరగడంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గింది. మొత్తం 9,862 మంది రైతుల నుంచి 6,66,439 క్వింటాళ్ల పత్తి సేకరించి రూ.518 కోట్లకు పైగా నేరుగా ఖాతాల్లో జమ చేశారు. గుంటూరులో 14 కేంద్రాల ద్వారా వేలాది క్వింటాళ్లు కొనుగోలు చేయగా పల్నాడులోనూ రికార్డు స్థాయిలో సేకరణ జరిగింది.
News February 25, 2026
జింబాబ్వేతో మ్యాచుకు రింకూ సింగ్ దూరం? శాంసన్‌కు ప్లేస్!

T20WC: తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో జట్టును వీడిన రింకూ సింగ్.. రేపటి జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం అనుమానమేనని స్పోర్ట్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ రింకూ దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. నిన్న అతడు చెన్నైలో ప్రాక్టీస్ కూడా చేశారు. అటు రింకూ ఫామ్ కూడా ఆశించినంత గొప్పగా లేదు. 5 మ్యాచుల్లో కలిపి 24 రన్స్ మాత్రమే చేశారు.


