News December 16, 2024
తిరుపతిలో వ్యభిచార గృహంపై దాడులు
తిరుపతి నగరంలోని భవానీ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కోస్తా, ఇతర ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి ఈ పని చేయిస్తున్నారు. పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడులు చేశారు. వ్యభిచారం నడిపిస్తున్న ఇద్దరు నిర్వాహకులను, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
Similar News
News February 5, 2025
చిత్తూరు: 19 నుంచి టెక్నికల్ పరీక్షలు
చిత్తూరు జిల్లాలో ఈనెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష (లోయర్, హయ్యర్ గ్రేడ్) పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షల షెడ్యూల్ WWW. bre.ap.gov.in వెబ్సైట్లో ఉన్నట్లు తెలిపారు.
News February 5, 2025
కుప్పం: రహదారుల అభివృద్ధికి రూ.53.35 కోట్లు మంజూరు
కుప్పం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి కోసం ఆర్ఐడిఎఫ్ గ్రాంట్ కింద రూ.53.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్ మునిరత్నం, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని 23 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
News February 4, 2025
కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7.85 కోట్లు
శాంతిపురం (M) రాళ్లబూదుగూరులో నెలకొని ఉండు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.85 కోట్లను మంజూరు చేసింది. కుప్పం ప్రాంతంలో అత్యంత పురాతన ఆలయంలో ఒకటైన శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.