News May 11, 2024

తిరుపతిలో సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్

image

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సుమారు 5వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 20, 2025

తవణంపల్లి MRO ఆఫీసులో JC విద్యాధరి తనిఖీలు 

image

తవణంపల్లి MRO ఆఫీసును బుధవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరి పరిశీలించారు. ఈ మేరకు ఆమె ఆఫీసులోని రికార్డులను తనిఖీ చేశారు. భూముల రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సమస్యలపై ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. 

News February 19, 2025

చిత్తూరు జిల్లాలో TODAY TOP NEWS

image

✒ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
✒ డాక్టర్లకు చిత్తూరు కలెక్టర్ వార్నింగ్
✒ పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
✒ పెనుమూరు: MLA హామీ.. తప్పిన ప్రమాదం
✒ పలమనేరు: బాలిక మృతి కేసులో డీఎస్పీ విచారణ
✒ తవణంపల్లి మండలంలో ముగ్గురి అరెస్ట్
✒ బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు

News February 19, 2025

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

image

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం శ్రీవాణి తెలిపారు. షాహిస్తా తబుసం, యశ్రబ్ స్కాలర్షిప్‌కు ఎంపికైనట్టు ఆమె వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

error: Content is protected !!