News February 3, 2025
తిరుపతిలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్

తిరుపతి పట్టణంలో 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News November 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 75 సమాధానాలు

ప్రశ్న: పాండవుల పక్షం వహించిన దృతరాష్ట్రుడి పుత్రుడెవరు?
జవాబు: పాండవుల తరఫున యుద్ధం చేసిన దృతరాష్ట్రుడి పుత్రుడు ‘యుయుత్సుడు’. ఆయన గాంధారి దాసి సుఖదకు జన్మించాడు. దాసీ పుత్రుడు అయినందుకు కౌరవులు దూరం పెట్టేవారు. ద్రౌపతి వస్త్రాపహరణాన్ని అడ్డుకున్నాడు. ధర్మంవైపు నిలిచి కౌరవులతో పోరాడాడు. కురుక్షేత్రంలో మరణించని కౌరవ వీరుడిగా నిలిచారు. ఆ తర్వాత హస్తినాకు సైన్యాధిపతిగా నియమించారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 23, 2025
స్విఫ్ట్ శాటిలైట్ కోసం నాసా రెస్క్యూ ఆపరేషన్

స్విఫ్ట్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఆర్బిట్ను స్థిరీకరించేందుకు రెస్క్యూ మిషన్ను నాసా లాంచ్ చేసింది. స్పేస్లో శక్తివంతమైన పేలుళ్లు, గామా-రే బరస్ట్లపై స్టడీకి 2004లో ప్రయోగించిన ఈ శాటిలైట్ ఆర్బిట్ క్రమంగా తగ్గుతోంది. దానిని స్టెబిలైజ్ చేసే బాధ్యతను కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్కి అప్పగించింది. స్విఫ్ట్ శాటిలైట్ లైఫ్ను పొడిగించి, సైంటిఫిక్ పరిశోధనలు కొనసాగించేందుకు మిషన్ను నాసా ప్రారంభించింది.
News November 23, 2025
మహిళలు.. మీకు సలాం

క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అన్న మాటలను భారత మహిళలు బద్దలు కొడుతున్నారు. కొన్ని రోజుల క్రితం హర్మన్ సేన ICC వన్డే వరల్డ్ కప్ గెలుచుకోగా, తాజాగా అంధుల మహిళల జట్టు తొలి టీ20 <<18367663>>WC<<>>ను నెగ్గింది. దీంతో ఆ జట్టుకు SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చూపు లేకపోయినా తమ ఆటతో మరికొందరికి భవిష్యత్తుకు దారి చూపించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. టాలెంట్ను ప్రోత్సహిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.


