News March 21, 2025
తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
Similar News
News September 16, 2025
గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

గరుగుబిల్లి మండలం నందివానవలస కోళ్లు ఫారం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గిజబ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరాడన ఆదినారాయణ మృతి చెందాడు. ఖడ్గవలస నుంచి రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం గిజబకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 16, 2025
హైవేల వల్ల భూములు విలువ పెరుగుతుంది: కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్లతో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యపై రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైవే రావడం వల్ల భూముల విలువ పెరుగుతుందన్నారు.
News September 16, 2025
HYD: ఎకరా రూ.101 కోట్లు.. ఇది బేస్ ప్రైజే..!

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.