News December 4, 2024
తిరుపతిలో 5న జాబ్ మేళా

పద్మావతి పురం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News December 9, 2025
చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.
News December 9, 2025
చిత్తూరు: ముగిసిన పులుల గణన

జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో పులుల గణన సోమవారం ముగిసింది. 4.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో చిత్తూరు ఈస్టు, వెస్టు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌కు ఉన్నాయి. వీటి పరిధిలో 24 సెక్షన్లు, 84 బీట్ల సిబ్బంది గణన ప్రక్రియలో పాల్గొన్నారు. నాలుగేళ్లకోసారి ఈ గణనను అధికారులు నిర్వహిస్తున్నారు.
News December 9, 2025
చిత్తూరు జిల్లాలో మరో ఇద్దరికి స్క్రబ్ టైఫస్

చిత్తూరు జిల్లాలో సోమవారం మరో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు బయట పడ్డాయి. జీడీనెల్లూరు మండలంలోని ముత్తుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తవణంపల్లి మండలం పల్లెచెరువు గ్రామానికి చెందిన మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్‌తో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


