News January 6, 2025
తిరుపతి: అంబులెన్స్ ఢీకొని ఇద్దరు భక్తులు మృతి
కాలినడకన వస్తున్న భక్తులను 108 అంబులెన్స్ ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని నారాయణ కళాశాల వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు నుంచి నడుచుకొస్తున్న భక్తులు తిరుపతి వైపుగా వెళుతుండగా వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News January 9, 2025
మరికాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరికాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. 12 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు చేరుకుంటారు.12 నుంచి 3 గంటల వరకు పరామర్శలు, టీటీడీ ఈఓ కార్యాలయంలో రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని విజయవాడకు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
News January 9, 2025
తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన భూమన
వివాదాస్పద వ్యక్తులకు TTD పాలనా పగ్గాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మాజీ ఛైర్మన్ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన మాట్లాడుతూ.. టీడీడీ చరిత్రలో ఇదో చీకటి రోజని, CM చంద్రబాబు పాలనా వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికీ పుష్కరాల ఘటన వెంటాడుతుందన్న ఆయన తాజా ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. YCP పాలనలో ఎన్నడూ ఇలా జరగలేదని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు.
News January 9, 2025
తిరుపతి రుయాలో పోస్ట్మార్టం
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరందరికీ మరికాసేపట్లో రుయా ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్మార్టం చేయనున్నారు. స్విమ్స్లో చనిపోయిన ఇద్దరు, రుయాలో చనిపోయిన నలుగురి మృతదేహాలకు ఇక్కడే శపపరీక్ష చేసి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే బంధువులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.