News July 9, 2024
తిరుపతి: అతిసారంతో ఇద్దరు మృతి!

అతిసారంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన తిరుపతిలో మంగళవారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని మనోవికాస కేంద్రంలో ఏడుగురు అతిసారానికి గురయ్యారు. వీరిని స్థానిక రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మనోవికాస కేంద్రంలో మానసిక వైకల్యం ఉన్నవారు ఉంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
చిత్తూరు: హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు-NH 140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
News December 9, 2025
చిత్తూరు నూతన DEOగా రాజేంద్ర ప్రసాద్

చిత్తూరు జిల్లా నూతన డీఈవోగా రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం బుక్కపట్నం డైట్ కాలేజీ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వారంలో ఆయన డీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. ప్రస్తుత చిత్తూరు డీఈవో వరలక్ష్మిని కార్వేటినగరం డైట్ కాలేజీకి బదిలీ చేయనున్నారు.
News December 9, 2025
చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.


