News December 19, 2024

తిరుపతి: అత్తను అత్యంత కిరాతకంగా చంపిన అల్లుడు

image

తిరుపతిలో అత్తను ఆమె అల్లుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. అలిపిరి పరిధిలోని సింగాలగుంటకు చెందిన ద్రాక్షాయిని (55) కొడుకు, కోడలు తరచూ గొడవలు పడుతుండేవారు. గొడవలకు కారణం ద్రాక్షాయిని అని ఆమె కోడలి తమ్ముడు రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 24, 2025

చిత్తూరు: కొత్త దంపతులకు ఊహించని పెళ్లి కానుక 

image

స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు బహుమతిగా విలువైన వస్తువులు ఇస్తుంటాం. కానీ చిత్తూరులో ఓ జంటకు అందిన బహుమతికి అందరూ ఆశ్చర్యపోయారు. నగరంలో జరిగిన ఓ పెళ్లికి ట్రాఫిక్ CI నిత్యబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన దంపతులకు బైకు హెల్మెట్‌ను బహూకరించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని, అప్పుడే మనతోపాటూ మనల్నే నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటారన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.  

News January 24, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

News January 24, 2025

తిరుపతి: ఫిబ్రవరి 3 నుంచి పరీక్షల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. డిగ్రీ తృతీయ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మూడో తేదీ, మొదటి సంవత్సరం పరీక్షలు 14వ తేదీ నుంచి ప్రారంభమం అవుతాయి. అభ్యర్థులు ఇతర వివరాలకు www.svudde.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.