News July 25, 2024
తిరుపతి: అన్నతో మద్యం తాగి.. వదిన, కూతుళ్లను చంపాడు

తిరుపతి పద్మావతి నగర్‌కు చెందిన టీపీ దాస్, మోహన్(35) అన్నాదమ్ముళ్లు. మోహన్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోగా.. ఆమె వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయాడు. నిన్న సాయంత్రం అన్నతో కలిసి మద్యం తాగాడు. తరువాత దాసు బయటకు వెళ్లాడు. అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన అన్న భార్య సునీత(40), కూతుళ్లు దేవశ్రీ(13), నీరజ(10)లను మోహన్ కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News January 2, 2026
చిత్తూరు: తగ్గిన రిజిస్ట్రేషన్లు

జనవరి 1న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. చిత్తూరు అర్బన్‌లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగకపోగా, చిత్తూరు రూరల్ పరిధిలో 4 మాత్రమే అయ్యాయి. సాధారణ రోజుల్లో రెండు కార్యాలయాల్లో కలిపి 30-50 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. పండగ నెల కావడంతో క్రయ, విక్రయదారులు లేకపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. జనవరి 1న సెలవుగా భావించి పలువురు రాలేదని అధికారులు చెప్పారు.
News January 2, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.
News January 2, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.


