News March 7, 2025
తిరుపతి: అయ్యో దేవుడా ఎంత పని చేశావు.!

ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కాని విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
Similar News
News October 25, 2025
NZB: జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

నిజామాబాద్-36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు, బోధన్-18 మద్యం దుకాణాలకు 455, ఆర్మూర్-25 మద్యం దుకాణాలకు 618, భీమ్గల్-12 మద్యం దుకాణాలకు 369, మోర్తాడ్-11 మద్యం దుకాణాలకు 381 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా NZB094-(ఏర్గట్ల) 96, NZB066-(ఆలూరు) 74, NZB097-(వేల్పూర్) 69 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరించారు.
News October 25, 2025
సిరిసిల్ల: పారామెడికల్ డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పారా మెడికల్ డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు https://www.tgpmb.telangana.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. బైపిసి విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 28 చివరితేదీ.
News October 25, 2025
నిజామాబాద్ రూపురేఖలు మారాలి: NZB కలెక్టర్

నిజామాబాద్ నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా నగర పాలక సంస్థ పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగర పాలక సంస్థ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.


