News March 7, 2025
తిరుపతి: అవును.. పోలీసులే క్లీన్ చేస్తారు..!

తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్ను సిబ్బందే క్లీన్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు శ్రమదానం చేశారు. స్టేషన్తో పాటు పరిసరాల్లోని చెత్తను తొలగించారు. పోలీసులే చీపురపట్టి క్లీన్ చేయడం విశేషం.
Similar News
News November 22, 2025
రేపు ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఒంగోలులోని డాక్టర్ BR అంబేడ్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.
News November 22, 2025
HYD: పైలట్పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
News November 22, 2025
నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

నెల్లూరు రూరల్లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


