News February 12, 2025
తిరుపతి: ఆమరణ నిరాహారదీక్షలో ప్రత్యేకంగా పోస్టర్

టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వాముల తిరుపతిలో ముంతాజ్ హోటల్ వద్దంటూ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలో ఓ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది. స్వాములు దీక్ష చేస్తున్న ప్రాంతంలో సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తున్నట్లు పోస్టర్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిని రోడ్డుపై వెళ్లే వారు సైతం ఆగి చూసి మరీ వెళ్తున్నారు.
Similar News
News October 18, 2025
అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ మరణం
1968: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
1991: భారత మాజీ క్రికెటర్ జయదేవ్ ఉనడ్కట్ జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ(ఫొటోలో) మరణం
News October 18, 2025
KMR: దీపావళి సేఫ్‌గా చేసుకోండి: SP

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని KMR SP రాజేష్ చంద్ర సూచించారు. అలాగే జిల్లాలో జూదంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. ఎవరైనా జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రౌడీలు, అనుమానితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలతో కట్టడి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
News October 18, 2025
పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్‌కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.