News November 14, 2024
తిరుపతి: ఆమె చనిపోయిందని చెప్పింది కుక్కనే..!
ఏర్పేడు మండలం బండారుపల్లిలో కరెంట్ షాక్ తగిలి యశోద మృతిచెందిన విషయం తెలిసిందే. పశువుల గడ్డి కోసం వెళ్లిన ఆమె తిరిగి వస్తుండగా కరెంట్ వైర్లు తగిలి చనిపోయారు. ఆ సమయంలో ఆచుట్టు పక్కల ఎవరూలేరు. ఆమె వెంట వచ్చిన కుక్కనే గట్టిగా కేకలు వేస్తూ అటూఇటూ తిరిగింది. ఇది గమనించిన గ్రామస్థులు కరెంట్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్థులు అక్కడికి వచ్చిన తర్వాత ఆ కుక్క యశోద ఒడి వద్ద అలా ఉండిపోయింది.
Similar News
News December 9, 2024
తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు
తిరుపతి రైల్వే కాలనీలో వ్యభిచారం కలకలం రేపింది. ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నడుపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓటేరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు అమ్మాయిలను పట్టుకున్నారు. ఈ మేరకు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.
News December 8, 2024
తిరుపతి, చిత్తూరుకు రైట్ రైట్ అంటున్న బడా హీరోలు
తెలుగు సినిమా ఉ.చిత్తూరు జిల్లాకు వరుసగా హాయ్ చెబుతోంది. చిత్తూరు నేపథ్యంలో ‘పుష్ప’ ఎంతటి హవా చూపించిందో తెలిసిందే. అంతకన్నాముందు నివేథా థామస్ 35 ఇది చిన్న కథకాదు, శర్వానంద్ శ్రీకారం, కిరణ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో వస్తున్న ‘కుబేర’ సైతం తిరుపతిలో షూటింగ్ జరిగింది. తమ యాస, భాష సరిహద్దులు దాటుతుందంటూ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
News December 7, 2024
అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మార్పులతో కూడిన పథకం అమలు చేయనుంది టీటీడీ.