News April 10, 2024
తిరుపతి: ఆరు సార్లు ఎంపీ… మరోసారి బరిలోకి

తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత చింతామోహన్ దే. 1984లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 1989, 1991, 1998, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి లోక్ సభలో ప్రవేశించారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.
Similar News
News March 21, 2025
సేవా పతకాలకు చిత్తూరు పోలీసులు ఎంపిక

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్‌కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.
News March 21, 2025
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మిథున్ రెడ్డి భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం పార్లమెంటు భవనంలో కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఉన్నారు.
News March 21, 2025
పులిచెర్ల: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.