News September 21, 2024

తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

పెట్రోల్ బంకు క్లియరెన్స్‌లో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిను సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పుత్తూరు పెట్రోల్ బంకు ఎన్ఓసీకి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణలో నిజమని తేలడంతో ఆయనపై వేటు వేసింది.

Similar News

News October 19, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

News October 19, 2025

పూతలపట్టులో చోరీ

image

పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు, వెండి కాళ్లపట్టీలు మూడు జతలు, రూ.50 వేలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 19, 2025

‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

image

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.