News January 28, 2025
తిరుపతి: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

తిరుపతి రూరల్ మండలం, మంగళంలో సమీపంలో ఉన్న ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా, డోన్కు చెందిన శివప్రసాద్ హాస్టల్లో ఉంటూ బీటెక్ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎవరి లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.
News November 28, 2025
NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
News November 28, 2025
21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.


