News January 18, 2025
తిరుపతి: ఎంత ఘోరమో కదా..!

చిత్తూరు గంగాసాగరం రోడ్డు ప్రమాదంలో అనేక విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతిలోని సప్తగిరి నగర్కు చెందిన పొన్ను చంద్ర(38) తల్లితో కలిసి మధురైలోని ఆసుపత్రికి బయల్దేరారు. తల్లి కింద సీటులో కూర్చోగా.. చంద్ర పైన సీటులో నిద్రించారు. బస్ బోల్తా పడినప్పుడు ఓ కరెంట్ స్తంభం బస్లోకి దూసుకొచ్చింది. దీంతో చంద్ర చనిపోగా.. తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో నిర్ఘాంతపోయారు.
Similar News
News December 1, 2025
చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను త్వరితగతిన, చట్టబద్ధంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఇందులో బైక్ దొంగతనం-1, చీటింగ్-1, కుటుంబ/ఇంటి తగాదాలు-9, వేధింపులు-1, భూ తగాదాలు-8, డబ్బు-4, దొంగతనం-1, ఆస్తి-6. ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
News December 1, 2025
ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.


