News March 6, 2025
తిరుపతి: ఎం. ఫార్మసీ ఫలితాలు విడుదల

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గత ఏడాది అక్టోబర్ నెలలో పీజీ ఎం. ఫార్మసీ (M.Pharmacy) రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.results.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News March 26, 2025
గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News March 26, 2025
ఆదోనిలో యువకుడి బలవన్మరణం

ఆదోనికి చెందిన 21ఏళ్ల యువకుడు ఉదయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. కార్వన్‌పేటలో నివాసం ఉంటున్న యువకుడు బేల్దారిగా పనిచేస్తున్నారు. తన సంపాదనతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఈక్రమంలో నిన్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 26, 2025
నెల్లూరు జిల్లాలోని HM, టీచర్లకు గమనిక

నెల్లూరు జిల్లాలోని ZP ప్రభుత్వ మున్సిపాలిటీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28వ తేదీలోగా తెలియజేయాలని డీఈఓ డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్‌సైట్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉందన్నారు.