News May 10, 2024

తిరుపతి: ఎన్నికల ఏజెంట్లకు కీలక సూచన

image

తిరుపతి: పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ లేదా పక్కన ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ అయి ఉండాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఎపిక్ కార్డ్ / ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా ఇతర ప్రత్యామ్నాయ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు.

Similar News

News December 24, 2024

టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు

image

* టీటీడీ ఆల‌యాలు, ఆస్తుల GLOBAL EXPANSION కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు. * దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం. * స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు. * టీటీడీ వైద్యులు, సిబ్బంది నియామకం, పరికరాలు కొనుగోలు. * భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు.

News December 24, 2024

చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నేడు ఆప్షనల్ సెలవు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఇవాళ ఆప్షనల్ సెలవును ప్రకటిస్తున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. తప్పనిసరిగా అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాలని ఆమె ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఈ నిబంధన వర్తించదు.

News December 24, 2024

తిరుపతిలో వ్యభిచారం.. ఒకరి అరెస్ట్

image

తిరుపతి నగరంలో మరోసారి వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని సత్యనారాయణపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఇద్దరు అమ్మాయిలతో కుమారి అనే మహిళ ఈ తంతు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుమారిని అరెస్ట్ చేశారు. ఇద్దరు అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద కేసు నమోదు చేసినట్లు అలిపిరి పోలీసులు వెల్లడించారు.