News July 26, 2024
తిరుపతి ఎయిర్‌పోర్టు పేరు మార్పు..?

తిరుపతి(రేణిగుంట) ఎయిర్‌పోర్టు పేరు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో ఈ విషయాన్ని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. అలాగే విజయవాడకు నందమూరి తారకరామారావు, ఓర్వకల్లుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను ప్రతిపాదించారు.
Similar News
News March 13, 2025
మడగాస్కర్ అధ్యక్షుడుతో చిత్తూరు MP భేటీ

మడగాస్కర్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జస్టిన్ టోక్లే తన ప్రతినిధి బృందంతో భారత దేశానికి వచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో పార్లమెంటు సమావేశ మందిరంలో లోకసభ స్పీకర్ ఓం బిర్లా, చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.
News March 13, 2025
పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి M.Rపల్లి మారుతినగర్ పరిధిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హై కోర్ట్‌ను ఆశ్రయించారు. అయితే ఈ భూములకు చెందిన ఎలాంటి పత్రాలు పెద్దిరెడ్డి వద్ద లేవని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమంటూ కోర్ట్ తేల్చి చెప్పింది.
News March 12, 2025
పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.