News July 15, 2024
తిరుపతి ఎస్పీకి ఘన వీడ్కోలు
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు అతిథి గృహం వద్ద ఆదివారం రాత్రి జిల్లా అధికారులు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. తనకు సహకరించిన వారికి ఎస్పీ కృతజ్ఞతలు చెప్పారు. అడిషనల్ ఎస్పీలు విమలాకుమారి, కులశేఖర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 12, 2024
మరో మూడు రోజులు జాగ్రత్త: తిరుపతి కలెక్టర్
తిరుపతి జిల్లాలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. జిల్లాలోని డివిజన్, మునిసిపల్, మండల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
News October 11, 2024
ఏర్పేడు: Ph.D ప్రవేశాలకు దరఖాస్తులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో 2024-25 విద్యా సంవత్సరానికి Ph.Dలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్ & క్లైమేట్ సైన్స్, హ్యుమానిటీస్& సోషల్ సైన్స్ విభాగాలలో అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. చివరి తేదీ నవంబర్ 03.
News October 11, 2024
నేను తిరుమలలో తప్పు చేయలేదు: మాధురి
చేయని తప్పుకు తాను క్షమాపణ చెప్పనని దివ్వెల మాధురి అన్నారు. తిరుమల పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడంతో స్పందించారు. ‘తిరుమలలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. దువ్వాడ గారితో చాలా మంది కార్యకర్తలు తిరుమలకు వెళ్లారు. నేనూ కార్యకర్తలాగే ఆయన వెంట వెళ్లా’ అని మాధురి చెప్పారు. తాను కొండపై ఎలాంటి తప్పు చేయలేదని.. తెలిసీతెలియక తప్పు జరిగి ఉంటే క్షమాపణ చెబుతున్నా’ అని దువ్వాడ అన్నారు.