News December 11, 2024

తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ధర్నా

image

రంగంపేట సమీపంలోని ఎంబీయూ వద్ద కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేయడంపై జర్నలిస్టు సంఘాలు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మీడియా సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

Similar News

News September 14, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 14, 2025

పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

image

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 13, 2025

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

image

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.