News March 11, 2025
తిరుపతి: ఏప్రిల్ 2 నుంచి దూరవిద్య పరీక్షలు

తిరుపతి ఎస్వీయూ దూర విద్యా విభాగ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి నిర్వహించాలని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పరీక్షలను మూడుసార్లు వాయిదా వేయగా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే పదో తరగతి పరీక్షల కారణంగా నిర్వహించలేమని అధికారులు చెప్పారు. ఏప్రిల్ 2 నుండి పరీక్షలు జరపాలని హైకోర్టు సూచించింది.
Similar News
News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
News March 27, 2025
మందమర్రి: రెండు లారీలు ఢీ.. ఒకరికి గాయాలు

మందమర్రి సమీపంలోని సోమగూడెం హైవేపై తెల్లవారుజామున రెండు లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనగా వెనుక లారీ క్యాబిన్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల నుంచి గాయపడ్డ వ్యక్తి బయటికి రావడానికి నానా యాతన పడుతున్నాడు. విషయం తెలుసుకున్న108 సిబ్బంది, పోలీస్ శాఖ, హైవే సిబ్బంది అక్కడి చేరుకొని క్షతగాడ్రుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
News March 27, 2025
భగభాన్ పాలైకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన గుంతకల్ కోర్టు

ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్ కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ముద్దాయికి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.