News March 30, 2024
తిరుపతి: ఏప్రిల్ 3న స్పాట్ అడ్మిషన్లు

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఎడ్ (B.Ed), బిఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులో ఖాళీగా ఉన్న 51 సీట్లుకు, ఏప్రిల్ మూడో తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని పేర్కొన్నారు. APED CET- 2023 అర్హత పొంది ఏ కళాశాలలో అడ్మిషన్ పొందనివారు స్పాట్ అడ్మిషన్లకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
Similar News
News December 3, 2025
చిత్తూరు జిల్లా చిన్నది అవుతుందనే..!

నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. MLA భానుప్రకాశ్ సైతం ఇదే అంశంపై పోరాడారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలో 31మండలాలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 4 మండలాలను మదనపల్లె జిల్లాలో కలిపారు. నగరిలోని 3 మండలాలను తిరుపతిలో కలిపిస్తే 24 మండలాలతో చిత్తూరు జిల్లా చిన్నది అవుతుంది. అందుకే నగరి మండలాలను చిత్తూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నారని సమాచారం.
News December 3, 2025
4న చిత్తూరు జిల్లాకు పవన్ రాక..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 4న చిత్తూరులో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. చిత్తూరు డీడీవో కార్యాలయాన్ని ఆయన నేరుగా ప్రారంభిస్తారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ఓపెన్ చేస్తారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News December 2, 2025
చిత్తూరు: 70 బస్సులకు నోటీసులు

కాలేజీ, స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిత్తూరు DTC నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో సుమారు 900 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయన్నారు. ఇటీవల 200పైగా బస్సులను తనిఖీ చేశామని.. నిబంధనలు పాటించని 70 బస్సులకు నోటీసులు అందించామని వెల్లడించారు.


