News April 3, 2024

తిరుపతి: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సింగ్ ప్రాక్టీషనర్-01, వార్డు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 08.

Similar News

News February 9, 2026

చిత్తూరు: ‘డ్రోన్ కెమెరా నుంచి తప్పించుకోలేరు’

image

కార్వేటినగరం పోలీసులు డ్రోన్ కెమెరా నిఘాతో మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సెకండ్ల వ్యవధిలో పట్టేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం సీఐ హనుమంతప్ప ఎస్ఐ తేజశ్వినితో కలిసి ధైర్యస్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రోన్ కెమెరా నిఘా పర్యవేక్షణలో మందుబాబులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 9, 2026

కుప్పంలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు

image

కుప్పం నియోజకవర్గంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు (20 ఏళ్ల లోపు గర్భం దాల్చడం) ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.8% టీనేజ్ ప్రెగ్నెన్సీ‌లు ఉండగా అందులో అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుప్పం తర్వాత నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12 శాతం కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు ఉన్నాయి.

News February 9, 2026

కార్వేటినగరంలో కోళ్లు మృతి.. DMHO తనిఖీలు

image

కార్వేటినగరం(M) RKVBపేటలో ఇందిరా కాలనీ వద్ద కోళ్ల ఫారంలో నాలుగు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం DMHO సుధారాణి కోళ్లఫారం ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.