News March 20, 2025
తిరుపతి: కప్ కైవసం చేసుకున్న పోలీస్ జట్టు

తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ T-20 టోర్నమెంట్‌లో అమర్ రాజా టీంపై పోలీస్ జట్టు ఘనవిజయం సాధించింది. క్రికెట్ ట్రోర్నమెంట్ లో రాఘవులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లలో 572 పరుగులు సాధించి అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు వారిని అభినందించారు.
Similar News
News April 18, 2025
చైనా నన్ను కలవాలనుకుంటోంది: ట్రంప్

చైనా దిగుమతులపై US 245% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య వివాదం ముదిరింది. US ఇలాగే టారిఫ్‌ల ఆట కొనసాగిస్తే దాన్ని పట్టించుకోబోమని చైనా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా తనను కలవాలని అనుకుంటోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మెక్సికో, జపాన్ వాణిజ్య ప్రతినిధులతో ప్రయోజనకర సంభాషణ జరిగిందని, ఇలాగే ఆ దేశమూ చర్చలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, చైనా దీనిపై స్పందించాల్సి ఉంది.
News April 18, 2025
మాదాపూర్: మే 1 నుంచి సమ్మర్ ఆర్ట్ క్యాంప్

మాదాపూర్‌లోని శిల్పారామంలో ఏటా నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్‌ను ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించే ఈ క్యాంపులో నామమాత్ర రుసుము, వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News April 18, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మరో పైలట్ ప్రాజెక్ట్

ఇందిరా గిరి సోలార్ జల వికాసం పథకానికి రూ.12,500 కోట్ల ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.