News October 13, 2024

తిరుపతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్‌లో 24X7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 08772236007 నంబరుకు సమాచారం కొరకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్, సముద్ర బీచ్ ప్రాంతాలలో రేపటి నుంచి 17 వరకు సందర్శకులకు అనుమతి లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.

Similar News

News November 17, 2025

చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్‌కు మస్త్

image

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్‌కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్‌ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.

చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

image

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.