News March 22, 2025
తిరుపతి కలెక్టర్ చేతుల మీదుగా వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ

వరల్డ్ వాటర్ డే సందర్భంగా శనివారం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా కలెక్టరేట్‌లో వాటర్ బ్రోచర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. నేచురల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ అందరికి అందుబాటులో ఉండాలని, ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని తాగాలని తెలిపారు. అనంతరం IIT-Tirupati ప్రొఫెసర్ అండ్ CDI వాటర్‌ను కనుగొన్న సైంటిస్ట్ డాక్టర్ షిహాబుద్దీన్‌ను కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 28, 2025
NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
News November 28, 2025
21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.
News November 28, 2025
7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

ఢిల్లీ పోలీస్ పరీక్షల(2025) తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
*కానిస్టేబుల్ (డ్రైవర్)- డిసెంబర్ 16, 17
*కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)- డిసెంబర్ 18 నుంచి జనవరి 6
*హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- జనవరి 7 నుంచి 12
*హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్, TPO)- జనవరి 15 నుంచి 22.
> పూర్తి వివరాలకు ఇక్కడ <


