News April 10, 2025
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్‌కు మహర్దశ

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్‌లు, 327 చిన్న బ్రిడ్జ్‌లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.
Similar News
News December 8, 2025
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.
News December 8, 2025
‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
News December 8, 2025
పెద్దపల్లి : 24 ఏళ్లకు మళ్లీ ఆ రిజర్వేషన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓదెల మండలం కొలనూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2001 తర్వాత గ్రామానికి ఈ రిజర్వేషన్ రావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న చాలామంది మొదటిసారి సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ రావడం.. ఇప్పుడుపోతే మళ్లీ ఎప్పుడు రిజర్వేషన్ వస్తుందో అన్న ఆలోచనతో అభ్యర్థులు ఈసారి తీవ్రంగానే శ్రమిస్తున్నారు.


