News February 5, 2025
తిరుపతి కార్పొరేటర్లపై వైసీపీ బహిష్కరణ వేటు

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో YCPకి వ్యతిరేకంగా ఓటు వేసిన కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా YCP అధ్యక్షుడు భూమన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన తిరుపతి 10వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డిసాయి ప్రతాపరెడ్డి, 11వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవల్లిక, 32, 33, 43 వార్డు కార్పొరేటర్లను పార్టీ నుంచి బహిష్కరించారు.
Similar News
News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
News November 19, 2025
ములుగు: పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు!

ములుగు జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 30 సెంటీగ్రేట్లకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాలో అత్యల్పంగా 11 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతలు ఎదుర్కొనేందుకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


