News February 27, 2026

తిరుపతి: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

image

తిరుపతి జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఈక్రమంలో ఆ హిజ్రాకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.

Similar News

News April 20, 2026

భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News April 20, 2026

మెగాస్టార్ సినిమాలో అనిల్ కపూర్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాబీ ఆయనకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి రోల్స్ కన్ఫర్మ్ అయితే మెగా సినిమాకు పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News April 20, 2026

SKLM: అత్త చితికి తలకొరివి పెట్టిన కోడలు

image

సరుబుజ్జిలిలోని షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం జరిగింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు. దీంతో ఎర్రమ్మ కోడలు కళావతితో నివాసం ఉండేది. కొంతకాలంగా ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఆదివారం ఆమె మృతి చెందగా కుమారులెవరూ లేకపోవడంతో కోడలు కళావతి అంత్యక్రియలు చేశారు.