News February 14, 2025

తిరుపతి: కిరణ్ రాయల్‌పై కేసు నమోదు

image

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్‌పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News January 7, 2026

వరంగల్‌లో పోలీసులు Vs ఎమ్మెల్యే

image

భీమారం పోలీస్ క్యాంపు స్థలం విషయంలో మంత్రి సాక్షిగా వరంగల్ పోలీసులకు, పశ్చిమ MLA నాయిని మధ్య వాగ్వాదం జరుగుతోంది. క్యాంపు స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ఇవ్వాలని MLA పట్టుబడుతుండగా, ఆ స్థలాన్ని పోలీసులకు అప్పగించాలని CP కోరుతున్నారు. ఇరువురిని మంత్రి పొంగులేటి పిలిచి మాట్లాడారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

News January 7, 2026

తేనెతో చర్మానికి తేమ

image

పొడిబారే చర్మతత్వానికి తేనె ప్యాక్‌లు వాడితే బాగా తేమగా మారుతుందంటున్నారు చర్మ నిపుణులు. పచ్చిపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. అలాగే తేనె, కలబంద, పాలు కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, కలబంద గుజ్జుకు రెండు చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పూత వేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మానికి తేమ అందుతుంది.

News January 7, 2026

NGKL: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా తెలకపల్లి, కల్వకుర్తి మండలంలో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్, బల్మూర్, ఊర్కొండ మండలంలో 11.2, బిజినేపల్లి మండలంలో 12.1, వెల్దండ మండలంలో 12.2, తాడూర్ మండలంలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి. దీంతో జిల్లాల్లో చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.