News April 9, 2025
తిరుపతి: కొత్త అధికారులు వీళ్లే..!

తిరుపతి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా బి.రాజా సోము, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా డి.రాజేంద్రకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈక్రమంలో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు శాఖల అభివృద్ధికి కృషి చేయాలని వారికి కలెక్టర్ సూచించారు.
Similar News
News October 19, 2025
ప్రమాదం జరిగితే ఇలా చేయండి: ప్రకాశం SP

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి రోజు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101కు సమాచారం అందించాలన్నారు. అలాగే పోలీస్ డయల్ 100, 112 నెంబర్లను సైతం సంప్రదించవచ్చని తెలిపారు. కాలుష్య రహిత టపాసులను ప్రజలు కాల్చాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News October 19, 2025
దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.
News October 19, 2025
విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

విజయవాడ భవాని ఐలాండ్లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.