News April 9, 2025
తిరుపతి: కొత్త అధికారులు వీళ్లే..!

తిరుపతి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా బి.రాజా సోము, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా డి.రాజేంద్రకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈక్రమంలో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు శాఖల అభివృద్ధికి కృషి చేయాలని వారికి కలెక్టర్ సూచించారు.
Similar News
News April 23, 2025
‘పేదరికం నుంచి బయటకి వచ్చేలా అవగాహన కల్పించాలి’

బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పి4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం ముఖ్యమని కలెక్టర్ చెప్పారు.
News April 23, 2025
పాకిస్థాన్‌కు భారత్ బిగ్ షాక్

పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసిన నేపథ్యంలో పాక్‌లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశం లభించింది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. సింధుకు ఉప నదులైన చీనాబ్, జీలం భారత్‌లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు..IND నుంచి పాక్‌లోకి ప్రవహిస్తుంది.
News April 23, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ఆదోని మార్కెట్లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు ☞ గాజులపల్లె వద్ద రైలు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు ☞ టెన్త్ ఫలితాల్లో నంద్యాల జిల్లాకు 17వ స్థానం ☞ అధికారులపై పాణ్యం MLA ఆగ్రహం ☞ పాణ్యంలో అత్యధికంగా 44⁰C ☞ పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేయండి: జేసీ ☞నంద్యాలలోని ఓ ఇంట్లో 12 అడుగుల కొండచిలువ ☞ పహల్గామ్ ఘటనపై మంత్రి బీసీ, ఎంపీ శబరి విచారం ☞ ఆర్యవైశ్యుల అభివృద్ధికి TDP అండ: మంత్రి ఫరూక్