News July 15, 2024
తిరుపతి: కోచ్ పోస్టులకు దరఖాస్తులు
ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో పార్ట్ టైం, ఫుల్ టైం ప్రాతిపదికగా కోచ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ & జిమ్, టెన్నిస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. B.P.ED చేసి, సంబంధిత క్రీడలో అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in వెబ్సైట్ చూడాలి. చివరి తేదీ జూలై 22.
Similar News
News January 13, 2025
కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్
భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
News January 13, 2025
తిరుపతి: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కర్ణాటక రాయల్పాడు వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఢీకొనడంతో తిరుపతికి చెందిన ప్రకాశ్, కడపకు చెందిన టీచర్ మారుతి శివకుమార్ మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి కట్టకిందపాలెంకు చెందిన ప్రకాశ్ (55) అశోకనగర్లో ఉండే ఆనంద్‌తో కలిసి బెంగళూరు వెళ్లాడు. ఆదివారం వారు వస్తుండగా రాయల్పాడు వద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. టీచర్ మృతదేహాన్ని శ్రీనివాసపురానికి తరలించారు.
News January 13, 2025
‘ఎస్వీయూ వీసీ పోస్ట్ బీసీలకు ఇవ్వాలి’
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టును బీసీలకు ఇవ్వాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేతే నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో బీసీలు 60 శాతం పైగా ఉన్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సగం కేటాయించాలని డిమాండ్ చేశారు.