News June 3, 2024
తిరుపతి: కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
ఈవీఎంలు భద్రపరచిన తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ హాలులో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని సూచించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ జరిగేలా అధికారులు పని చేయాలన్నారు.
Similar News
News December 29, 2024
చిత్తూరు కలెక్టరేట్లో రేపు గ్రివెన్స్ డే: కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 29, 2024
తిరుపతి: పరీక్షలు వాయిదా
తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.
News December 29, 2024
కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.