News December 5, 2024
తిరుపతి: గంజాయి కేసులో 17 మంది అరెస్ట్

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు చేపడుతున్న 17 మందిని అరెస్టు చేసినట్టు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గురువారం తెలిపారు. శ్రీకాళహస్తి వన్ టౌన్, టూ టౌన్, BN కండ్రిగ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారన్నారు. నిందితుల నుంచి 32 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
ద్రవిడ వర్సిటీ వీసీగా చిన్న మల్లయ్య బాధ్యతలు

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
News March 16, 2026
సెలవులో చిత్తూరు కలెక్టర్

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
News March 16, 2026
చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


